لَآ أُقۡسِمُ بِيَوۡمِ ٱلۡقِيَٰمَةِ
అలా కాదు! నేను పునరుత్థాన దినపు శపథం చేస్తున్నాను.
القيامة
Read Surah Al-Qiyamah in Telugu (القيامة) with Arabic text, Telugu translation, and audio recitation. Chapter 75 of the Holy Quran, 40 verses — free online.
తెలుగులో ఖురాన్ · all 114 సూరాs
لَآ أُقۡسِمُ بِيَوۡمِ ٱلۡقِيَٰمَةِ
అలా కాదు! నేను పునరుత్థాన దినపు శపథం చేస్తున్నాను.
وَلَآ أُقۡسِمُ بِٱلنَّفۡسِ ٱللَّوَّامَةِ
అలా కాదు! నేను తనను తాను నిందించుకునే అంతరాత్మ శపథం చేస్తున్నాను.
أَيَحۡسَبُ ٱلۡإِنسَٰنُ أَلَّن نَّجۡمَعَ عِظَامَهُۥ
ఏమిటి? మేము అతని ఎముకలను ప్రోగు చేయలేమని మానవుడు భావిస్తున్నాడా?
بَلَىٰ قَٰدِرِينَ عَلَىٰٓ أَن نُّسَوِّيَ بَنَانَهُۥ
వాస్తవానికి! మేము అతని వ్రేళ్ళ కొనలను గూడా సరిగ్గా సవరించగల సమర్ధులము.
بَلۡ يُرِيدُ ٱلۡإِنسَٰنُ لِيَفۡجُرَ أَمَامَهُۥ
అయినా, మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు.
يَسۡـَٔلُ أَيَّانَ يَوۡمُ ٱلۡقِيَٰمَةِ
అతడు: "అయితే ఈ పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుంది?" అని అడుగుతున్నాడు.
فَإِذَا بَرِقَ ٱلۡبَصَرُ
కళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు;
وَخَسَفَ ٱلۡقَمَرُ
మరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు;
وَجُمِعَ ٱلشَّمۡسُ وَٱلۡقَمَرُ
మరియు సూర్యచంద్రులు కలిపి వేయబడినప్పుడు;
يَقُولُ ٱلۡإِنسَٰنُ يَوۡمَئِذٍ أَيۡنَ ٱلۡمَفَرُّ
మానవుడు ఆ రోజు: "ఎక్కడికి పారి పోవాలి?" అని అంటాడు.
كَلَّا لَا وَزَرَ
అది కాదు! (అతనికి) ఎక్కడా శరణం ఉండదు!
إِلَىٰ رَبِّكَ يَوۡمَئِذٍ ٱلۡمُسۡتَقَرُّ
ఆ రోజు నీ ప్రభువు వద్దనే ఆశ్రయం ఉంటుంది.
يُنَبَّؤُاْ ٱلۡإِنسَٰنُ يَوۡمَئِذِۭ بِمَا قَدَّمَ وَأَخَّرَ
ఆ రోజు మానవుడికి, తాను చేసి పంపంది మరియు వెనక వదలింది అంతా తెలుపబడుతుంది[1].
[1] చూడండి, 18:49.
بَلِ ٱلۡإِنسَٰنُ عَلَىٰ نَفۡسِهِۦ بَصِيرَةٞ
అలా కాదు! మానవుడు తనకు విరుద్ధంగా, తానే సాక్షి అవుతాడు;
وَلَوۡ أَلۡقَىٰ مَعَاذِيرَهُۥ
మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే![1]
[1] చూడండి, 24:24, 36:25 లేక 41:20-22.
لَا تُحَرِّكۡ بِهِۦ لِسَانَكَ لِتَعۡجَلَ بِهِۦٓ
నీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను గ్రహించటానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు[1].
[1] జిబ్రీల్ ('అ.స.) ఖుర్ఆన్ అవతరింపజేసేటప్పుడు, దైవప్రవక్త ('స'అస) ఏ పదాన్ని కూడా మరచిపోరాదని త్వరత్వరగా చదివేవారు. అల్లాహుతా'ఆలా త్వరత్వరగా చదువటం నుండి నివారించాడు. ('స.బు'ఖారీ). ఇటువంటి వాక్యానికై చూడండి, 20:114.
إِنَّ عَلَيۡنَا جَمۡعَهُۥ وَقُرۡءَانَهُۥ
నిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే!
فَإِذَا قَرَأۡنَٰهُ فَٱتَّبِعۡ قُرۡءَانَهُۥ
కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు.
ثُمَّ إِنَّ عَلَيۡنَا بَيَانَهُۥ
ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే[1]!
[1] దైవప్రవక్త ('స'అస) ఖుర్ఆన్ ను ప్రజలకు అర్థమవటానికి వివరించి చెప్పింది కూడా అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి, తనకు తెలుపబడిందే. ఈ వివరణలే 'హదీసులు!
كَلَّا بَلۡ تُحِبُّونَ ٱلۡعَاجِلَةَ
అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు;
وَتَذَرُونَ ٱلۡأٓخِرَةَ
మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు![1]
[1] అంటే పరలోక జీవితాన్ని నమ్మటం లేదు. మీరు మీ జీవితం కేవలం ఈ ఇహలోక జీవితం మాత్రమే అనే భ్రమలో పడి ఉన్నారు. మీరు పునరుత్థరింపబడతారని నమ్మటం లేదు.
وُجُوهٞ يَوۡمَئِذٖ نَّاضِرَةٌ
ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి;
إِلَىٰ رَبِّهَا نَاظِرَةٞ
తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి[1];
[1] ఇవి విశ్వాసుల ముఖాలు.
وَوُجُوهٞ يَوۡمَئِذِۭ بَاسِرَةٞ
మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి[1];
[1] ఇవి సత్యతిరస్కారుల ముఖాలు.
تَظُنُّ أَن يُفۡعَلَ بِهَا فَاقِرَةٞ
నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి[1].
[1] అంటే వారు నరకంలో వేయబడతారని తెలుసుకొని.
كَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِيَ
అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు[1];
[1] మరణం ఆసన్నమైనప్పుడు.
وَقِيلَ مَنۡۜ رَاقٖ
మరియు: "ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది[1].
[1] ఇటువంటి ఆయత్ కోసం చూడండి, 28:71-72.
وَظَنَّ أَنَّهُ ٱلۡفِرَاقُ
మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు;
وَٱلۡتَفَّتِ ٱلسَّاقُ بِٱلسَّاقِ
మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది[1].
[1] అంటే అతడు తాను కష్టాల పాలవుతున్నానని తెలుసుకుంటాడు.
إِلَىٰ رَبِّكَ يَوۡمَئِذٍ ٱلۡمَسَاقُ
ఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది!
فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ
కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపనూ లేదు[1]!
[1] చూడండి, 4:17-18.
وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ
మరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు!
ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهۡلِهِۦ يَتَمَطَّىٰٓ
ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు!
أَوۡلَىٰ لَكَ فَأَوۡلَىٰ
(ఓ సత్యతిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది!
ثُمَّ أَوۡلَىٰ لَكَ فَأَوۡلَىٰٓ
అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది!
أَيَحۡسَبُ ٱلۡإِنسَٰنُ أَن يُتۡرَكَ سُدًى
ఏమిటీ? మానవుడు తనను విచ్చల విడిగా వదలిపెట్టండం జరుగుతుందని భావిస్తున్నాడా?
أَلَمۡ يَكُ نُطۡفَةٗ مِّن مَّنِيّٖ يُمۡنَىٰ
ఏమీ? అతడు ప్రసరింప జేయబడిన ఒక వీర్యబిందువు కాడా?
ثُمَّ كَانَ عَلَقَةٗ فَخَلَقَ فَسَوَّىٰ
తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు[1].
[1] చూడండి, 87:2 మరియు 91:7.
فَجَعَلَ مِنۡهُ ٱلزَّوۡجَيۡنِ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ
ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు.
أَلَيۡسَ ذَٰلِكَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحۡـِۧيَ ٱلۡمَوۡتَىٰ
అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా?
Al-Qiyamah
Play