Surah Al-Humazah in Telugu

    الهمزة

    Surah Al-Humazah in Telugu

    Read Surah Al-Humazah in Telugu (الهمزة) with Arabic text, Telugu translation, and audio recitation. Chapter 104 of the Holy Quran, 9 verses — free online.

    తెలుగులో ఖురాన్ · all 114 సూరాs

    وَيۡلٞ لِّكُلِّ هُمَزَةٖ لُّمَزَةٍ

    అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.[1]

    [1] హుమ'జహ్ మరియు లుమ'హజ్: కొందరి అభిప్రాయంలో ఒకే అర్థం గలవి. మరి కొందరు వాటి మధ్య భేదం చూపుతారు. హుమ'జహ్ - అంటే ముఖం మీద అపనిందలు చేసేవారు. లుమ'జహ్ - అంటే వీపు వెనుక చాడీలు చెప్పేవారు. మరికొందరు హుమ'జహ్ - అంటే కండ్ల సైగలతో, చేతి సైగలతో దూషించటం మరియు లుమ'జహ్ - అంటే నోటి మాటలతో దూషించటం, అని అంటారు.

    ٱلَّذِي جَمَعَ مَالٗا وَعَدَّدَهُۥ

    ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో![1]

    [1] అంటే 'జకాతు మరియు 'సదఖాత్ ఇవ్వకుండా ఉంటాడో!

    يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ

    తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు![1]

    [1] అ'ఖ్ లదహ్: అంటే అది అతనిని మరణించకుండా చేస్తుందని భావిస్తాడు.

    كَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ

    ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.[1]

    [1] చూఅల్-'హు'తమతు: నరకాగ్ని పేర్లలో ఒకటి. చూడండి, 15:43-44. ముక్కలు ముక్కలుగా చేసేది.

    وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ

    ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా?[1]

    [1] ఆ అగ్ని ఎంతో భయంకరమైనది. దాని తీవ్రతను బట్టి మీ బుద్ధి అర్థం చేసుకోజాలదు.

    نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ

    అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;

    ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ

    అది గుండెల దాకా చేరుకుంటుంది.

    إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٞ

    నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.[1]

    [1] ముఅ''సదతున్: క్రమ్ముకొను. ఆ నరకపు ద్వారాలు మూయబడి ఉంటాయి. ఎవ్వరూ దాని నుండి బయట పడలేరు.

    فِي عَمَدٖ مُّمَدَّدَةِۭ

    పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!

    Al-Humazah

    Play